పాఠశాల విద్యార్థులు చదువుకునే సమయంలో పొరపాట్లు చేయడం మామూలు విషయమే.ఇచ్చిన హోమ్ వర్క్ పూర్తి చేయకపోవడం, లేకపోతే క్లాస్ రూములలో అల్లరి చేయడం, ఇంకా ఏదైనా గొడవలు సృష్టించడం లాంటి పనులు చేస్తుంటే పిల్లాడిని ఉపాధ్యాయులు శిక్షించడం మామూలు విషయమే.
అయితే కొన్నిసార్లు పరిస్థితులను అనుసరించి.లేకపోతే, పొరపాటున జరగడం లాంటి విషయాలలో ఉపాధ్యాయులు పిల్లలపై వారి ప్రతాపాన్ని మితిమీరి చూపించడం మనం ఇదివరకు చాలా సార్లు చూసాము.
తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది.ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
వైరల్ గా మారిన వీడియో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెం మానస వికాస్ పాఠశాలలో( Manasa Vikas School ) విద్యార్థినిని ఉపాధ్యాయుడు చితకబాదడం కనపడుతుంది.ఘటనలో దెబ్బలు తిన్న విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుందామని పాఠశాలకు చేరుకొని అక్కడ విషయాన్ని బయట పెట్టారు.అసలు విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎందుకు కొట్టాడని.
ఒకవేళ తప్పు చేసిన ఇంతలా కొట్టాలా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సిసికెమెరాలో ఘటన సంబంధించిన దృశ్యాలు మొత్తం రికార్డ్ అయ్యాయి.
అది చూసిన స్కూలు యాజమాన్యం, పిల్లాడి తల్లిదండ్రులు( School management, child’s parents ) ఉపాధ్యాయుడిపై మండిపడుతున్నారు.వెంటనే ఉపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని కోరారు.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు చూస్తే కన్న తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.మరికొందరు, ఇలాంటి టీచర్లు ఇకనైనా మారాలంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే ఇలాంటి ఉపాధ్యాయులపై పోలీసు కంప్లైంట్ ఇవ్వాలని కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.