తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలోని పధిర,వెంకటాపూర్ గ్రామాలలోని ఐకెపి సెంటర్లను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేసి తరలించాలని అధికారులకు సూచించారు.

 Stained Rice Should Be Purchased Immediately , Yellareddypet, Congress, Domma-TeluguStop.com

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ తో మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా పారా బాయిల్డ్ రైస్ మిల్ కు తరలించేటట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఐకెపి ఎపిఎం మల్లేశంతో మాట్లాడుతూ సెంటర్ నిర్వాహకులతో వడ్ల యజమానులతో మాట్లాడి సుమారు తడిసిన 10 లారీల ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.

రైతులకు నష్టం జరగకుండా అన్ని విధాల ఆదుకుంటామని రైతులకు భరోసానిచ్చారు.

పదిర ఐకెపి సెంటర్( IKP Centre ) కు వచ్చే సంవత్సరం గోదాం మంజూరు చేయించి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

ఐకెపి మహిళా సంఘాలతో రైతులు మాట్లాడి ముందుగా మార్కెట్ స్థలాన్ని చదును చేసి మొరం పోయించుకోవాలన్నారు.అనంతరం వెంకటాపూర్ ఐకెపి సెంటర్ ను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఇందులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రాంరెడ్డి ,డైరెక్టర్లు మెండే శ్రీనివాస్,తిరుపతిరెడ్డి, గొల్లపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు బండారి బాల్ రెడ్డి, చెరుకు ఎల్లయ్య, వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube