వేములవాడ లో డబుల్ బెడ్ రూమ్ లు పూర్తి అయ్యేనా

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లో వేములవాడలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ మైన నిరుపేదలకు ఇచ్చారా అని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపెట్టండి మేము అక్కడ ఓటు అడగం అని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేని ఊరు మేము చూపిస్తాం వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు అడగకుండా ఉండండి అంటూ ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల పేరిట సంబరాల కంటే ముందు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు అందించే ఆలోచన చేయండన్నారు.2018 ఎన్నికల కంటే ముందు వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో సుమారు పదివేల పైచిలుకు డబుల్ బెడ్రూంలు మంజూరు చేస్తామని మీరు ఇచ్చిన హామీ ఏమైందనీ అన్నారు.

 Will The Double Bedrooms Be Completed In Vemulawada, Double Bedrooms , Vemulawa-TeluguStop.com

అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ బస్ డిపో పక్కన ఉన్నటువంటి అర్ధాంతంగా ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఇంకా పూర్తికాని పనులు అప్పుడే గుంతలు పడుతున్న వైనం.

నాసిరకపు నాణ్యతలేని పనులు పేదలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఈ డబుల్ బెడ్ రూమ్ కట్టడంలో చూస్తే తెలుస్తుందన్నారు.సంబరాలను పక్కన పెట్టండనీ,ఈ పెండింగ్ పనులను పూర్తి చేయండనీ తెలిపారు.

ఎన్నికల అప్పుడే ఈ ప్రభుత్వానికి అభివృద్ధి గుర్తుకువస్తుందనీ ఈ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూములు పూర్తి కాకపోతే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే…

అప్పుడు నిర్మాణం పూర్తి చేసి పేదలకు డబుల్ బెడ్ రూమ్ లను అందిస్తాం ఈ సందర్భంగా ఆయన శ్రీనివాస్ అన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది పేదలు ఎవరైనా ఇండ్లు నిర్మించుకుంటే 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తామని వారన్నారు.

శనివారం రైతు దినోత్సవం చేశారు కానీ వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లను మాత్రం కొనుగోలు చేస్తలేరనీ, లారీల కొరత తీరుస్తలేరనీ ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.తక్షణమే డబుల్ బెడ్ రూంలోను నిర్మించి అర్హులైన నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, వకులాభరణం శ్రీనివాస్,నాయకులు చిలుక రమేష్, మోడిగే చంద్రశేఖర్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, కనికరపు రాకేష్, నాగుల విష్ణు ప్రసాద్, తోట లహరి, బొజ్జ భారతి, ఎర్రం రాజు, చిలువేరి శ్రీనివాస్ గౌడ్, పల్లపు రాజేందర్, లింగంపల్లి కిరణ్, వస్తాదు కృష్ణ గౌడ్, ఎర్రం ఆగయ్య, దేవేంద్ర, దేవరాజు, రాజ నర్సు, ప్రభాకర్ రెడ్డి, వంగ పరుశురాం, తిరుపతి, అక్కనపల్లి నరేష్, సాబీర్, మర్రిపల్లి రాజు, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube