కాంతి పదం రాజన్న సిరిసిల్ల జిల్లా జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు నిర్వహించిన పోటీలలో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన మున్సిపాలిటీలలో సిరిసిల్ల పురపాలక సంఘానికి ఉత్తమ మున్సిపాలిటీ అవార్డ్ కు ఎంపిక చేయడం జరిగింది.ఈ అవార్డ్ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం లో ఉ.10.30 ని”లకు అందించడం జరుగుతుంది.సిరిసిల్ల పురపాలక సంఘం వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించుటకు గాను బర్ధన్ బ్యాంక్ లు ఏర్పాటు, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పొడి చెత్త నిర్వహణ (డి ఆర్ సి సి) విజయవంతంగా అమలు పరుస్తున్నందున అలాగే తడి చెత్త నిర్వహణ లో భాగంగా విండ్రో, వర్మి కంపోస్ట్ ద్వారా ఎరువు ను తయారు చేసి విజయవంతంగా తడి చెత్త నిర్వహణ చేస్తున్నందుకు,
సిరిసిల్ల పట్టణ పరిధిలో 24 ( ఆర్ ఆర్ ఆర్ ) సెంటర్ లలో ప్రజలకు అందుబాటులోని కమ్యూనిటీ హాల్స్ వున్న వార్డులు మాత్రమే కాకుండా కమ్యూనిటీ హాల్స్ లేని వార్డుల్లో మొబైల్ ఆర్ఆర్ఆర్ కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్నoదుకు, మేరీ లైఫ్ మేర స్వచ్ఛ షేహర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించుట పట్టణ పరిధిలోని అంబెడ్కర్ జంక్షన్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు పట్టణంలోని ప్రముఖులు, ఎన్జీవోలు, ప్రజలతో ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది.వీటిని గాను సిరిసిల్ల పురపాలక సంఘాన్ని గుర్తించి ఈ అవార్డ్ కి ఎంపిక చేయడం జరిగింది అని ప్రకటించడం జరిగింది.







