Red Onions Vs White Onions : ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దవాళ్లు సామెత చెబుతూ ఉంటారు.ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలును చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

 Red Onions Vs White Onions Which One Is Healthierred Onions Vs White Onions Whi-TeluguStop.com

అయితే ఉల్లి( Onions ) లేకుండా వంట గది ఊహించడం కూడా అసాధ్యం.అలాగే ఉల్లి లేకుండా ఒక్క వంటకాన్ని కూడా చేయలేము.

అందుకే ఇంట్లో ఖచ్చితంగా ఉల్లి నిల్వ ఉండేలా చూసుకోవాలి.ఉల్లి ధరలు పెరిగితే అది పెద్ద వార్త అవ్వడానికి అదే కారణమవుతుంది.

అయితే సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తాయి.వీటిలో ఒకటి తెల్ల ఉల్లిగడ్డ అయితే, మరొకటి ఎర్ర ఉల్లిగడ్డ.

అలాగే పట్టణాల్లో దాదాపు మనం ఎర్ర ఉల్లిగడ్డలని ఉపయోగిస్తాము.చాలా తక్కువ మాత్రమే తెల్ల ఉల్లి గడ్డలు కనిపిస్తాయి.

అయితే గ్రామాల్లో మాత్రం ఎక్కువ గా తెల్ల ఉల్లిగడ్డను చూస్తూ ఉంటాము.ఇంతకీ ఈ రెండింటిలో ఏది మంచిదో( White Onion vs Red Onion ) ఏ ఉల్లిగడ్డ వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.దీనికి ప్రధాన కారణం తెల్ల ఉల్లిగడ్డ వల్ల కలిగే ప్రయోజనాలే అని చెప్పవచ్చు.

Telugu Tips, Red White, Redwhite, White-Telugu Health

తెల్ల ఉల్లిపాయలలో( White Onions ) ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.ఇందులో ఎక్కువగా విటమిన్‌ సి( Vitamin C ), ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా తెల్ల ఉల్లిగడ్డ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ రక్తం లోని షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి.

దీంతో ఈ ఉల్లిగడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.

Telugu Tips, Red White, Redwhite, White-Telugu Health

అంతేకాకుండా తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.ముఖ్యంగా శరీరంలో ఏర్పడే కనితిల పెరుగుదలను నిరోధిస్తాయి.తెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను( Cholesterol Levels ) కూడా తగ్గిస్తాయి.

అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అధిక రక్తపోటును తగ్గించడానికి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కూడా తెల్ల ఉల్లి ఎంత గానో సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube