ఏలినాటి శని అంటే ఏంటో తెలుసా.? దాని నుండి తప్పించుకోవాలంటే ఇలా చేయండి.!

ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది.ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు.

 What Is Elinati Shani Effects And Remedies , Elinati Shani,  Horoscope, Vishnu S-TeluguStop.com

నాడు అంటే అర్ధ‌భాగం అని అర్థం.శని ప్రభావము చాలా తీవ్రమైనటువంటిది.

ఈ మధ్యకాలంలో శని వలన బాధలు పడేవారు చాలా ఎక్కువగా కనబడుతున్నారు.ఎలా అయితే మనము మన కర్మ ఫలాన్ని తప్పించుకోలేమో అలాగే శని ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోలేము.

కానీ కొంతవరకు ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

జాతకచక్రంలో 12 రాశులుంటాయి.గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది.12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశిస్తుంది.ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు.దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం.శని పాపగ్రహం అందుకనే కష్టాలు కలుగుతాయి.ఈ గ్రహం మన రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథ‌మ‌స్థానానికి వెళ్లిపోవడం… తదితరాలు జరుగుతాయి.

శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు.ఉదాహ‌ర‌ణ‌కు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి.

అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి.

శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.

విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు.ప్రతిశనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి.

పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు.యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది.

శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube