రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లళ్లపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ)( Kavvampally Satyanarayana ).ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రానికి( Anganwadi Centre ) రిపేర్లు చేయించడంతో పాటు టాయిలెట్స్, మంచినీటి సదుపాయము, ప్రహరీ గోడ లాంటి పనులు చేయాలనీ సూచించారు.
అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ తయారు చేయాలని ఆదేశించారు అదేవిధంగా ప్రతి కేంద్రంలో కూడా సరైన వసతులు లబ్ధిదారులకు కల్పిస్తూ, మెరుగైన సేవలు అందించాలని సూచించారు.అలాగే పోషణ మాసంలో భాగంగా తయారు చేసిన వివిధ రకాల వంటలను వివిధ రకాల పోషక పదార్థాల మెనూను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మంచి ఆహారం తీసుకోవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, సిడిపిఓ ఉమారాణి, సూపర్వైజర్ చంద్రకళ, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజ, అంగన్వాడీ టీచర్, ఆయా , గ్రామ సభ్యులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.