ఆకుకూరలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఎంతగానో ఉపయోగపడుతాయి.ముఖ్యంగా కంటి చూపు ని మెరుగుపరుస్తూ కంటి సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది.
అంతేకాదు ఆకుకూరలు తినడడం వలన మధుమేహ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.ఎలాంటి ఆకు ప్రతీ రోజు ఆకు కూరలు ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వలన శరీర పెరుగుదల , దృఢత్వానికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.
పాలకూర,గోంగూర ,మెంతికూర ,తోటకూర,పుదీనా,బచ్చలి ,మునగ ఆకు వంటివి ఆహారంలో తింటూ ఉంటే శరీరానికి ఐరన్,విటమిన్స్ ఏ ,సి ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి.ఆకుకూరల్లో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏమిటంటే వీటిలో ఉండే కెరోటిన్ విటమిన్ సి గా మారి కంటి చూపు తగ్గే సమస్యని నిరోధిస్తుంది.
ఎముకలు,దంతాలని ధృడ పరుస్తుంది.
దగ్గు ఆయాసంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మరియు కంటి చూపు మెరుగ్గా కనపడటానికి గోంగూరని వారంలో రెండు సార్లు తీసుకుంటే చాలు.
కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే పొన్నగంటి కూరని తీసుకోవడం వలన బరువు తగ్గుతుంది,బీపీని కంట్రోల్ చేస్తుంది.గుండె సంభందిత వ్యాధులని అదుపులో ఉంచడమే కాకుండా క్యాన్సర్ కారకాలని నివారిస్తుంది.
అలాగే ఉల్లికాడలు కూడా అధిక రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది.