ఈ పొడిని రోజు తీసుకుంటే బ్రెయిన్ షార్ప్ అవ్వ‌డ‌మే కాదు మ‌రెన్నో బెనిఫిట్స్‌!

బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అంత బాగా రాణించగలుగుతారు.అందుకే మెదడుకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉండాలని నిపుణులు చెబుతుంటారు.

 Taking This Powder Daily Will Make The Brain Sharper , Sharp Brain, Brain, Powde-TeluguStop.com

అయితే మెదడు ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే పొడి కూడా ఒకటి.

ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ చ‌ప్పున‌ ప్రతిరోజు తీసుకుంటే బ్రెయిన్ సూపర్ షార్ట్ గా మారడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.

మరి ఇంతకీ ఆ పొడి ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో శుభ్రంగా కడగాలి.అనంతరం తడి లేకుండా బీట్ రూట్‌ను తుడుచుకుని సన్నగా తురుముకోవాలి.

ఈ తురుమును ఎండలో బాగా ఎండ పెట్టుకుని మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వేరుశనగలను వేసుకుని వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న వేరుశ‌న‌గ‌లను పొట్టు తొలగించి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్ రూట్ పొడి, ఒక కప్పు వేరుశనగల పొడి, ఒక కప్పు బెల్లం పొడి వేసుకొని అన్ని కలిసేలా మిక్స్ చేసుకుంటే బీట్ రూట్ పీనట్ పొడి సిద్ధం అవుతుంది.

ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చప్పున కలిపి సేవించాలి.ఈ పొడిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.అంతేకాదు ఈ బీట్ రూట్ పీనట్‌ పొడిని డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.వెయిట్ లాస్ అవుతారు.

ఎముకలు బలోపేతం అవుతాయి.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.

మ‌రియు హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube