దసరా బంఫర్ ఆఫర్, దసరా ధమాకా పేర్లతో 100 కొట్టు గిఫ్ట్ పట్టు

దసరా బంఫర్ ఆఫర్, దసరా ధమాకా పేర్లతో 100 కొట్టు గిఫ్ట్ పట్టు అనే క్యాప్షన్ తో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు.పండుగల సందర్భంగా ప్రైజ్ మనీ, బహమతులు పేర్లతో ప్రజల వద్ద డబ్బులు వసులు చేస్తే కఠిన చర్యలు.

 Dussehra Bumper Offer, 100 Kottu Gift Pattu In Names Of Dussehra Dhamaka, Dusseh-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా దసరా బంఫర్ ఆఫర్, దసర ధమాకా పేర్లతో సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తూ వివిధ రకాల వస్తువులు మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర,10 గ్రాముల వెండి నాణంమద్యం(Goat, rice cooker, chickens, silk saree, 10 grams of silver coin liquor) అను బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

వేములవాడ పట్టణ పరిధిలో (శ్రీకాంత్, ప్రశాంత్, మహేందర్,వెంకటేష్,స్వామి.

) మరియు కోడిముంజ గ్రామంలో(E.వికాస్, N సాయి,E అజేయ్, R రమేష్, E చందు.

) లు దసరా బంఫర్ ఆఫర్, దసర ధమాకా పేర్లతో సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో ప్రకటనలు జారీ చేసి మోసం చేస్తున్న పై 10 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

పండుగల సందర్భంగా ప్రజలు ఎవరు కూడా చీటీలు, ప్రైజ్ మనీ, బహమతులు పేర్లతో పెట్టె ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా మోసపోవద్దని, ఇటువంటివి ప్రకటనలు ఉంటే పోలీస్ వారికి దృష్టికి తీసుకరావాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube