ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింత వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో భక్తులు( Devotees ) గ్లాసుల లాంటివి పట్టుకొని ఏదో జలాన్ని( Sacred Water ) పట్టుకుంటున్నట్లుగా కనిపించింది.
వీరు వెళ్లిన ఆలయంలో ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది.దాని నుంచే నీరు కిందకి జారుతున్నాయి.
భక్తులు ఆ విషయాన్ని గమనించలేదు.అది పవిత్రమైన తీర్థం అనుకుని వాళ్లు దాన్ని తాగడం వైరల్ వీడియోలో( Viral Video ) చూడవచ్చు.
ఆలయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాన్ని ఎలా తీసుకుంటారో, అలాగే ఆ నీటిని భక్తులు తీసుకుంటున్నారు.కానీ అది పవిత్రమైన నీరు కాదు, ఎయిర్ కండిషనర్( Air Conditioner ) నుంచి వచ్చే సాధారణ నీరే.
అదే సాధారణ నీరు అని తెలుసుకునేంత ఆలోచన చేయలేదు.చాలా గుడ్డిగా వీరు వాటిని తాగుతూ తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.
ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.భక్తులు తమ ఆలోచన శక్తిని పూర్తిగా కోల్పోవడం బాధాకరమని కామెంట్లు చేశారు.ఇలా అంధభక్తుల్లాగా అన్నిటినీ నమ్మటం సరికాదని, మన దేశం వరల్డ్ లీడర్, సుప్రీం పవర్ కావాలని అనుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలు జరగడం బాధాకరం అని అన్నారు.ఇలా అనాలోచితంగా ప్రవర్తించడం వల్ల మన సమాజానికి నష్టమే కలుగుతుందని పేర్కొన్నారు.
మన దేశంలో మతం చాలా ముఖ్యమైనదే అయినా ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు ఆందోళన కలుగుతోందని కొందరన్నారు.మరింత తెలివిగా ఆలోచించాలని సూచించారు.అసత్యాలను నమ్మి చేసే పనులు అందరికీ ప్రమాదకరమే అని చెప్పుకొచ్చారు.మొత్తం మీద ఈ టెంపుల్ వీడియో సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చకు దారి తీసింది.
దీన్ని మీరు కూడా చూసేయండి.