పకడ్బందీగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ నెలాఖరు వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్ – 10 కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.

 Operation Smile Should Be Carried Out With Full Force District Collector Anurag-TeluguStop.com

గౌతమి, అదనపు ఎస్పీ డి.చంద్రయ్య లతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పోలీస్, రెవెన్యూ, లేబర్, విద్యా, మహిళా, శిశు సంక్షేమ వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి భిక్షాటన చేస్తున్న పిల్లలను, వీధి బాలలను, పనిలో ఉన్న పిల్లలను గుర్తించాలని అన్నారు.వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చి, కౌన్సిలింగ్ ఇప్పించడంతో పాటు పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.

దివ్యాంగులకు సంబంధించిన అంశాలపై చర్చించిన కమిటీ దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు.వారికి అందజేసిన పరికరాలకు సంబంధించి ఏవైనా రిపేరింగ్ ఉన్నట్లయితే టెక్నీషియన్స్ ని పిలిపించాలని అన్నారు.

దివ్యాంగులను ఎవరు కించపరచకుండా, దివ్యాంగుల చట్టం పటిష్టంగా అమలయ్యేలా అవగాహన కల్పించాలని, ఎవరైనా కించపరచినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాన్స్ జెండర్లకు సంబంధించిన అంశాలపై చర్చించిన కమిటీ వారికి పునరావాసము, ఐడీ కార్డులకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సఖీ కేంద్రం నిర్వాహకులకు సూచించారు.

ఆసుపత్రుల్లో, బ్యాంకులలో వయో వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సఖి కేంద్రం ద్వారా అందిస్తున్న సేవల తీరును ఆరా తీసిన కలెక్టర్ సఖి కేంద్రానికి వచ్చే బాధిత మహిళలకు నాణ్యమైన సేవలు అందించాలని, ఒత్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మనోధైర్యాన్ని కల్పించాలని అన్నారు.

ఐసిడిఎస్ ద్వారా గర్భిణీలకు బాలింతలకు అందుతున్న పోషకాహారాన్ని ప్రతి రోజు తనిఖీ చేయాలని సీడీపీఓ లను ఆదేశించారు.సూపర్ వైజర్లు క్రమం తప్పకుండా సెంటర్లను తనిఖీ చేసి నాణ్యమైన ఆహార పదార్థాలు సమయానికి అందేలాగా చూడాలని ఆదేశించారు.

మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టడానికి, పని చేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ గురించి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ద్వారా వివరాలు సేకరించాలని అన్నారు.టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అందిస్తున్న జీవన నైపుణ్యాల గురించి భేటీ బచావో భేటి పడావో, మహిళా సాధికారికత అంశాల గురించి విపులంగా చర్చించి మహిళా సాధికారికతకు పెద్దపీట వేసేలా కృషి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అంజయ్య, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు, బీసీ అభివృద్ధి శాఖ అధికారి మోహన్ రెడ్డి, సహాయ లేబర్ అధికారి రఫీ, ఎస్ డీసీ గంగయ్య, భూమిక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సత్యవతి, ఇతర ఎన్జీఓ లు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube