రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రజలు వారి యొక్క వ్యవసాయ పొలాల వద్ద, మరికొంతమంది వేటగాళ్లు కరెంటు తీగలు అమర్చి వన్యప్రాణుల మృతికి కారకులు అవుతున్నారు.ఇట్టి చర్యల వలన అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల కాలంలో కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం, రుద్రంగి మండల మానాల గ్రామ శివారులో కొంతమంది వన్యప్రాణుల కోసం ఏర్పర్చిన కరెంటు తీగలకు ఇద్దరు వ్యక్తులు మరణించినారు.దీనికి సంబంధించి వీరిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరిగింది.
కాబట్టి ప్రజలు కానీ, వేటగాళ్లు గాని వన్యప్రాణులు కొరకు కరెంట్ తీగలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణుల ప్రాణాలు తీయడం కూడా చట్టరీత్యా నేరం.కావున ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడుననీ వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.