ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ, పురుషుల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో, వారు చేసే పనులలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది.మగ, ఆడ జంతువుల మధ్య కూడా ఈ తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది.
పురుషులతో పోలిస్తే మహిళలు వారిని మించి జీవిస్తారు.దీనికి వైద్యులు చెబుతున్న మాట ఏమిటంటే మాములుగా అయితే మగవారు వారి జీవితకాలంలో వైద్యులను సంప్రదించడం అనేది తక్కువగా ఉంటుంది.
మరి అనారోగ్య సమస్యలు(Health problems ) ఉంటే తప్ప వారు వైద్యులను సంప్రదించరు.ఇక ఈ విషయంలో మహిళలు అలా కాదు.
వివాహమైన దగ్గరి నుంచి మహిళలకు వైద్యుల సలహాలు తప్పనిసరి.ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా ఒత్తిడి, నిరాశ, ఆందోళన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో కూడా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు.హార్మోన్ల వ్యత్యాసాల వల్ల పురుషులు రిస్కు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.పురుషుల్లో ఎక్కువ ప్రమాదకర వృత్తులను ఎంచుకోవడం సైనిక పోరాటం, ఆయుల్ రిగ్లు, పోలీస్ వర్క్, ఫైర్ ఫైటింగ్ వంటి అధిక రిస్క్ టాస్క్‌లలో మహిళల కంటే ఎక్కువ సంఖ్యల్లో ఒత్తిడి ( Stress )ఉంటుంది.ఇది అనేక అనారోగ్య సమస్యలకు, ఒత్తిడి, అనారోగ్య జీవన శైలికి కారణమవుతుంది.
ముఖ్యంగా రగ్బీ, బాక్సింగ్, కార్ రేస్, మోటార్ సైకిల్ రేసింగ్ ఇలా చాలా క్రీడలు ఒత్తిడితో జరిగేవే అని చాలామందికి తెలుసు.ఇవి అకాల మరణానికి కూడా దారి తీస్తాయి.

ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాలలో అయితే మగవారిలో కార్డియోవాస్కులర్( Cardiovascular diseases ) వ్యాధి ప్రధానంగా ఉంది.గుండె, స్ట్రోక్, వాస్కులర్ డిసీజ్, ప్రాబల్యం మహిళలతో పోల్చితే పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచడానికి కారణమవుతుంది.వీటితో పాటు అనారోగ్యాలను పెంచే ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమవుతున్నాయని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ధూమపానం, మద్యపానం, ఎక్కువగా స్త్రీలతో సంబంధం కలిగి ఉండడం వల్ల చాలా రకాల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.అలాగే మహిళల కంటే పురుషుల ఆత్మహత్యల రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇవన్నీ మహిళల కన్నా పురుషులు త్వరగా చనిపోవడానికి కారణమవుతున్నాయి.







