చెక్ డ్యామ్ నిర్మాణ పనులు వేగిరం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) జిల్లాలోని మానేరు, మూలవాగుపై నిర్మాణంలో ఉన్న అన్ని చెక్ డ్యామ్ పనులను వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ( N Khemya Naik ) ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా లో మానేరు వాగుపైన అప్పర్ మానేరు, మిడ్ మానేరు మధ్య 11, మూలవాగు పై 13 చెక్ డ్యామ్ లను మొత్తం 24 చెక్ డ్యామ్ లను 155 కోట్ల రూపాయలతో చేపట్టారు.

 Check Dam Construction Work Should Be Speeded Up ,n Khemya Naik, Manair , Rajan-TeluguStop.com

మానేరు( Manair )పై చేపట్టిన చెక్ డాం నిర్మాణ పనులను ఇరిగేషన్, ఇంజనీర్ లు పర్యవేక్షిస్తుండగా మూలవాగుపై చేపట్టిన చెక్ డ్యామ్ పనులను ప్యాకేజీ-9 ఇంజనీర్ లు పర్యవేక్షిస్తున్నారు.సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వీటి నిర్మాణ పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ రెండు విభాగాల కార్యనిర్వహక , ఉప ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ లతో సమీక్షించారు.

మూల వాగు పై చేపట్టిన 13 చెక్ డాములకు గాను 9 పూర్తయ్యాయనిప్యాకేజీ-9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు తెలిపారు.

మానేరు పై చేపట్టిన 11 చెక్ డ్యాం లలో 3 పూర్తయ్యాయని ఇరిగేషన్ కార్యనిర్వాక ఇంజనీర్ అమరేందర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు తెలిపారు.

మూల వాగు పై పెండింగ్లో ఉన్న 2 చెక్ డ్యాములను ఈ నెలాఖరులోగా, మిగతా 2 చెక్ డ్యామ్లను అక్టోబర్ నెలలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్యాకేజీ-9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి నీ అదేశించారు.మానేరు పై ప్రగతిలో ఉన్న 8 చెక్ డ్యామ్ నిర్మాణ పనులను వేగిరం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్ లను జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube