అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను పరిశీలన బృందాలు కచ్చితంగా నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి అన్నారు.శుక్రవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్‌ అధికారి, ప్రత్యేక అధికారి, మీడియా , ఎక్సైజ్, ఆదాయపన్ను నోడల్ అధికారులు,సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంటింగ్‌ టీం సభ్యులతో ఆయన సమావేశ మయ్యారు.

 Election Campaign Expenses Of Candidates Should Be Recorded Accurately, Election-TeluguStop.com

సిరిసిల్ల, వేములవాడ శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్‌ టీమ్‌, వీఎస్టీ, వీవీటీలు నమోదు చేయాలన్నారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ద్వారా నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌షోలు అన్నింటినీ వీడియో సర్వేయిలెన్స్‌ టీం సభ్యులు రికార్డింగ్‌ చేసి వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియోను పరిశీలించి వివరాలను అకౌంటింగ్‌ టీం సభ్యులకు అందించాలన్నారు.

అకౌంటింగ్‌ టీం సభ్యుల వివరాలను షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు.అనంతరం పూర్తి వివరాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించా లన్నారు.ర్యాలీలు, సమావేశాలు ద్వారా నిర్వ హించిన పార్టీ ప్రచార ఖర్చులను నిర్ణయించిన రేట్‌ల ప్రకారం నమోదు చేయాలన్నారు.కరపత్రాలు, పోస్టర్లు, ప్లెక్సీలు ముద్రించినప్పుడు ప్రింటర్‌ మరియు ప్రచురణకర్తలు ఎన్నికల ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, వాణిజ్య పన్నుల శాఖ వ్యయ పరిశీలన శాఖలు ఎన్నికల వ్యయం నమోదులో సమన్వయంతో పని చేయాలని అన్నారు.

ఎన్నికల వ్యయాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైన తనకు తెలియజేయండి.

ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి జిల్లాలో ఎన్నికల వ్యయాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైన తన మొబైల్ నెంబర్ 8977124147 కు తెలియజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి తెలిపారు.సిరిసిల్ల పట్టణంలోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ కు వచ్చి తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చునన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్‌ అధికారి రామ కృష్ణ, ప్రత్యేక అధికారిని స్వప్న , మీడియా నోడల్ అధికారి మామిండ్ల దశరథం, ఎక్సైజ్ జిల్లా నోడల్ అధికారి పంచాక్షరి, ఆదాయపన్ను నోడల్ అధికారీ లాలూన్, ఎల్ డి ఎం మల్లిఖార్జున్ రావు, సహాయ వ్యయ పర్యవేక్షకులు, అకౌంటింగ్‌ టీం సభ్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube