మహిళల, బాలికల రక్షణ కొరకే జిల్లా షీ టీమ్ అదనపు ఎస్పీ చంద్రయ్య.మహిళలను,బాలికలను, విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జిల్లాలో గత మూడు నెలల వ్యవధిలో వివిధ సందర్భాల్లో మహిళలను, బాలికలను, విద్యార్థినులను వేధిస్తున్న 22 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించిన అదనపు ఎస్పీ.ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మహిళలను,బాలికలను,విద్యార్థినులకు వేధిస్తున్న పోకిరీలపై 37 కేసులు, 40 పెట్టి కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళలు,చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు.
మహిళలను ,విద్యార్థినుల వేధించిన, వెంబడించిన సామాజిక మధ్యమాల ద్వారా వేధించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా జిల్లా షీ టీమ్ ని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడతాయని అదనపు ఎస్పీ తెలిపారు.
అదనపు ఎస్పీ వెంట షీ టీమ్ ఏ.ఎస్.ఐ ప్రమీల, మహిళ కానిస్టేబుల్ ప్రియాంక ఉన్నారు
.