రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డీపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం లో భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్132వ జయంతి జయంతి వేడుకలను ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి తన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని తన ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజ్, వార్డ్ సభ్యులు ఎనగందుల అంజలి, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు కొత్త చెన్నయ్య, గడ్డం జితేందర్, గడ్డం వెంకటేష్,బుర్క దర్మేందర్, గడ్డం ఆనందం, బిఆర్ఎస్ నాయకులు ఆఫ్జల్ తో పాటు 100 మంది మహిళలు పాల్గొన్నారు.