విత్తన శుద్ధి పై అవగాహన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల యొక్క దత్తత గ్రామమైన రాళ్లపేటలో శుక్రవారం రోజున వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు రైతులకు కూనారం సన్నాలు అనే వరి రకం విత్తనాలను పంపిణీ చేశారు.వరిలో విత్తన శుద్ది పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 Awareness Program On Seed Treatment, Awareness Program ,seed Treatment, Seeds Pu-TeluguStop.com

ఈ సందర్భంగా డా.జె.రాజేందర్ రైతులకు విత్తన శుద్ధి ప్రాముఖ్యత వివరిస్తూ రైతులకు స్వయంగా విత్తన శుద్ది ఎలా చేసుకోవాలో నేర్పించారు.కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండజిమ్ 50 శాతం మందును కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలని దంప నారుమళ్ళకయితే లీటరు నీటికి ఒక గ్రాము కార్బండెజిమ్ 50 శాతం మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలని సూచించారు.

కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు మందు నీరు సరిపోతుందని కార్బండెజిమ్ 25 శాతం, మాంకోజెబ్ 50 శాతం మిశ్రమ శిలీంధ్రనాశనిని వాడితే 2 గ్రాముల కిలో విత్తనానికి లీటరు నీటికి చొప్పున వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు, దత్తత గ్రామ కమిటీ సభ్యులు డా.

సతీష్, డా.సంపత్, రాళ్ళపేట మాజీ సర్పంచ్ పరుశ రాములు, దారం శ్రీనివాసరెడ్డి, సోమ వెంకటేష్, సోమ రాజశేఖర్, రాచర్ల శ్రీకాంత్, సోమ ఎల్లయ్య, సోమ పరశురాములు, సోమ మల్లయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube