మాల్దీవులలో చనిపోయిన చంద్రయ్య శవ పేఠిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet )లోని నారాయణపూర్ నికి శుక్రవారం చేరింది.గ్రామానికి చెందిన శీతాల చంద్రయ్య ( Chandraiah )ప్రమాదవశాత్తు మాల్దీవులలో పని చేస్తూ మృతి చెందగా శవపేటిక శుక్రవారం గ్రామానికి చేరుకుంది భార్య పోషవ్వ కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించగా గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.బతుకుదెరువు కోసం బొంబాయిలో ఆప్గాన్ కంపెనీలో పనిచేస్తూ కంపెనీ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా మాల్దీవులకు తీసుకెళ్లడం జరిగింది.20 సంవత్సరాల నుండి అదే కంపెనీలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

 Coffin Of Chandraya Who Died In Maldives ,chandraiah, Maldives , Yellareddypet-TeluguStop.com

2 నెల రోజుల క్రితం తన అన్న నర్సయ్య మృతిచెందగా గ్రామానికి వచ్చి అందరిని కలిసి వెళ్లడం జరిగింది.అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో చంద్రయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది ఇతని మృతితో భార్య పోషవ్వ కుటుంబానికి ఆధారం లేకుండా పోయిందని విలేఖరి శేఖర్ తో ఆవేదన వ్యక్తం చేసింది వీరికి ఒక కూతురు భాగ్యలక్ష్మి ఉండగా లింగాపూర్ గ్రామానికి చెందిన సతీష్ తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు.

ప్రభుత్వపరంగా వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube