రాజన్న సిరిసిల్ల జిల్లా :మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 92 వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు రెండు విడుతలుగా ప్రధానమంత్రి పదవిని సమర్థవంతంగా నిర్వర్తించారు.మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయామ్ లో తెలంగాణను ప్రకటించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు.
అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన భారత ఆర్థిక వ్యవస్థను ఎటువంటి సంక్షోభానికి గురికాకుండా పరిపాలనను చేశారని పేర్కొన్నారు.అదేవిధంగా భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్గా కూడా విధులు నిర్వహించి మంచి ఆర్థిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి, డైరెక్టర్లు సూడిది రాజేందర్, గుల్లపెల్లి లక్ష్మారెడ్డి, మెండే శ్రీను, శెట్టిపల్లి బాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి ఏలూరి రాజయ్య, నాయకులు బండారి బాల్ రెడ్డి, సింగారం మల్లేశం, గంట బుచ్చ గౌడ్, బుర్కా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.