ప్రత్యేక అదనపు అనుబంధ పోషకాహారం పై ప్రత్యేక సమావేశం...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్( Government Whip Shri Adi Srinivas ) సూచనలతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సలహాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.జిల్లా సంక్షేమ అధికారి శ్రీ లక్ష్మీరాజం మాట్లాడుతూ జిల్లాలో ఎన్ హెచ్ టి ఎస్ ప్రత్యేక ఆప్ ద్వారా పిల్లల యొక్క పెరుగుదలను బరువు ఎత్తు జబ్బచుట్టు కొలతలను పరీక్షించి అంగన్వాడీ టీచర్లు యాప్ లో నమోదు చేస్తున్నారని దాని ద్వారా వారి యొక్క పెరుగుదలలో పోషణలోపము ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఇలాంటి అంశాలను గుర్తించి నమోదు చేస్తున్నారు.

 Special Meeting On Special Supplemental Nutrition, Government Whip Shri Adi Srin-TeluguStop.com

అంగన్వాడి టీచర్ నమోదు చేసిన తర్వాత అవి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆన్ లైన్ NHTS app ద్వారా వెళ్తాయని చెప్పారు.తద్వారా అక్కడున్న మెడికల్ అధికారి మూడు రోజులలోపు ఆ పిల్లల సంబంధించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

అలా నిర్వహించిన తర్వాత వారికి అవసరమైన మందులు గాని అవసరమైన ప్రత్యేక పోషణ గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.తద్వారా జిల్లాలో పోషణ లోపాన్ని అరికట్టడానికి వైద్య శాఖ యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుందని ఈ సమన్వయ సమావేశం అందులో భాగంగా ఏర్పాటు చేశారు.

ఇందులో ఉన్నా వివిధ దశలను ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా సూచించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్( Poshan Abhiyaan ) టెక్నికల్ అసిస్టెంట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ దశలన్నింటిని వివరించడం జరిగింది.

ప్రతి పిల్లవాడు యొక్క పెరుగుదలని మనము మానిటర్ చేయడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా ఉండి భవిష్యత్తులో మంచి సమాజం నిర్మించబడుతుందని తెలియజేశారు.ఈ సందర్భంగా మనకు స్థానికంగా దొరికే ఆహారపు కూరగాయలు పండ్లు పొలాలు ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలన విరివిగా తీసుకోవాలని సూచించారు.

అలాగే ఆకుకూరలు పుదీనా మెంతికూర తోటకూర పాలకూర బచ్చలి కూర గోంగూర కొత్తిమీర లాంటి ఆకుకూరలను తప్పనిసరిగా ప్రతిరోజు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలని సూచించారు.అలాగే జంక్ ఫుడ్ లు రోడ్ల పైన దొరికే చిరు తిల్లు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు వాటి వలన పిల్లల ఎదుగుదలలో ప్రాబ్లం సమయస్యలతో పాటు భవిష్యత్తులో ఊబకాయము లాంటి జీవనశైలి వ్యాధులు కూడా వస్తాయని వివరించారు.

అలాగే ఎనీమియా లోపం దాని వలన కలిగే నష్టాలు దాని గురించి వివరిస్తూ మంచి ఆహార పదార్థాలు పాలు గుడ్డు సంపూర్ణ ఆహారమని వాటిని కూడా విరివిగా తీసుకోవాలని సూచించడం జరిగింది.అలాగే ఎనీమియా ముక్తభారత్ కి సంబంధించి ఎనీమియా మాడ్యూల్ ఎలా నిర్వహించాలో సూపర్వైజర్ లందరికీ మెడికల్ ఆఫీసర్లకు ఆన్లైన్ సెషన్ ప్రత్యక్ష శిక్షణ ఇవ్వడం జరిగింది.

మంచి ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్యాన్ని నివారించవచ్చని భవిష్యత్తు బాగుంటుందని అలాగే వారి యొక్క అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని తద్వారా మానసిక శారీరక వికాసం కలుగుతుందని సూచించారు.ఈనాటి ఈ సమావేశానికి జిల్లా వైద్యాధికారి వసంతరావు, పిల్లల వైద్యులు హాజరై వారి యొక్క లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా పిల్లలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలి ఎంత మోతాదులో ఏ ఏ సమయాల్లో ఆహార పరీక్షలు ఆకలి పరీక్షలు నిర్వహించాలి అనే విషయాన్ని చర్చించి విపులంగా వివరించడం జరిగింది.

ఉపవైద్యాధికారులు రాజగోపాల్ ,రజిత జిల్లా ప్రోగ్రాం అధికారి ఉమా, రాష్ట్రీయ బాలస్వాస్య యోజన ప్రోగ్రాం ఆఫీసర్ ఉమ సిడిపివోలు ఉమారాణి, సౌందర్య ఏసిడిపిఓ సుచరిత, జ్యోతి, బి హబ్ కోఆర్డినేటర్ రోజా, సూపర్వైజర్లు మెడికల్ ఆఫీసర్లు హెల్త్ సూపర్వైజర్లు పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube