అధిక బ‌రువు ఉన్న‌వారికి వ‌రం పాల‌కూర‌.. ఇలా తీసుకుంటే మ‌స్తు లాభాలు..!

అధిక బ‌రువు( Overweight )తో బాధ‌ప‌డుతున్నారా.? ఇరుగు పొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ ను స‌హించ‌లేక‌పోతున్నారా.? వెయిట్ లాస్ అవ్వడం కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు పాలకూర ఒక వరం అనే చెప్పుకోవచ్చు.బరువు తగ్గడానికి తోడ్పడే సుగుణాలు పాలకూర‌లో మెండుగా ఉన్నాయి.ముఖ్యంగా పాలకూరను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీరు మీ వెయిట్ లాస్ ప్రక్రియను మరింత వేగవంతం చేసుకోవచ్చు.

 How To Take Spinach For Weight Loss? Weight Loss, Weight Loss Tips, Latest News,-TeluguStop.com
Telugu Tips, Latest, Spinach-Telugu Health

అందుకోసం ముందుగా ఐదు నుంచి ఆరు పాలకూర ఆకులను తీసుకుని కాడలు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసుకున్న పాలకూర ఆకులు వేసుకోవాలి.అలాగే సన్నగా తరిగిన ఒక గ్రీన్ యాపిల్( Green Apple ), అరకప్పు పీల్ తొలగించిన కీర దోసకాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.దాంతో మన జ్యూస్ రెడీ అవుతుంది.

Telugu Tips, Latest, Spinach-Telugu Health

గ్లాస్ లోకి జ్యూస్ పోసుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ వేసి మిక్స్ చేసి సేవించాలి.ఈ పాలకూర జ్యూస్ ను వారానికి మూడు సార్లు కనుక తీసుకుంటే అద్భుత ఫలితాలు పొందుతారు.ఈ పాల‌కూర జ్యూస్‌ బరువు తగ్గించే ప్రయాణానికి సహాయకరంగా ఉంటుంది.ఇది ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, మరియు విట‌మిన్ సి వంటి పోషకాలతో నిండి ఉంటుంది.

అందువ‌ల్ల ఈ పాల‌కూర జ్యూస్ మీ మొత్తం ఆరోగ్యం మరియు జీవక్రియకు మద్దతు ఇస్తుంది.పాల‌కూర‌( spinach )లో కేలరీలు తక్కువగా.ఫైబర్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల‌ ఎక్కువ స‌మ‌యం పాటు మీ క‌డుపును నిండుగా ఉంచుతుంది.అతి ఆక‌లిని అణ‌చివేస్తుంది.

పాల‌కూర‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి.మరియు బరువు నిర్వహణకు దోహదం చేస్తాయి.

కాబ‌ట్టి వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌వారు త‌ప్ప‌కుండా మీ డైట్ లో పైన చెప్పుకున్న పాల‌కూర జ్యూస్ ను చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube