రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన పోతరాజు అనిత(Potaraju Anita) పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 కి సమాచారం ఇవ్వగా సకాలంలో స్పందించిన 108 సిబ్బంది సిరికొండ గ్రామానికి( Sirikonda village) చేరుకొని పురిటినొప్పులతో బాధపడుతున్న పోతారాజు అనితను సిరిసిల్ల ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువై మార్గమధ్యంలో 108 వాహనంలో పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వడం జరిగింది.ఇఎన్ టి సుర శ్రీకాంత్,పైలెట్ మనోజ్ ఆశా వర్కర్ సకాలంలో స్పందించడం వలన సుఖ ప్రసవం జరిగిందని,తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఈ సందర్భంగా సహకరించిన 108 సిబ్బందికి పోతరాజు అనితకుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
Latest Rajanna Sircilla News