రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన గంట లక్ష్మి బుచ్చ గౌడు ను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గంట లక్ష్మి బుచ్చ గౌడులను స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నాగుల ప్రదీప్ గౌడ్, గౌడ సోదరులు గంట అంజాగౌడ్, పందిర్ల లింగం గౌడ్, గంట వెంకటేష్ గౌడ్, బుచ్చినింగి సంతోష్ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంట సకారం గౌడ్, గంట శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







