వైట్ హెయిర్.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని సతమతం చేసే సమస్య ఇది.
అందులోనూ చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిందంటే ఇక వారి బాధ వర్ణణాతీతం.ఈ క్రమంలోనే వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే కలర్స్ అక్కర్లేదు.సహజంగానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏమిటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి.మరసటి రోజు పల్చటి వస్త్రం సహాయంతో ఉడికించిన మిశ్రమం నుంచి లిక్విడ్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ లిక్విడ్ ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న లిక్విడ్ ను వేసుకోవాలి.

అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ను వేసి బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సహజంగానే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.