వయసు పైబడే కొద్ది ముఖ చర్మం సాగటం, రంగు తగ్గడం వంటివి జరుగుతూనే ఉంటాయి.అయితే కొందరు మాత్రం ఈ సమస్యలను తక్కువ వయసులోనే ఫేస్ చేస్తుంటారు.
ఆహారపు అలవాట్లు, స్కిన్ కేర్ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, మద్యపానం, ధూమపానం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.అయితే కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే కనుక ముఖ చర్మాన్ని టైట్ గా మరియు వైట్ గా మార్చుకోవచ్చు.
పైగా ఈ రెమెడీని యూస్ చేయడం వల్ల మరెన్నో ప్రయోజనాలను సైతం తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమిడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు ఉడికించిన రైస్ ను వేసుకోవాలి.
అలాగే అందులో సపరేట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, నాలుగు నైట్ అంతా నానబెట్టుకుని పొట్టు తొలగించిన బాదం పప్పులు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఇలా ఫిల్టర్ చేసుకున్న మిశ్రమాన్ని ఐస్ ట్రేలో నింపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

నాలుగు లేదా ఐదు గంటల అనంతరం తయారైన ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖానికి సున్నితంగా రబ్ చేసుకోవాలి.ఆపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ముఖాన్ని ఆరబెట్టుకుని అప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
అలాగే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.అంతేకాదు ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.
చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా సైతం మారుతుంది.







