చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి::జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ,నివాళులర్పించిన జిల్లా కలెక్టర్(District Collector), అదనపు కలెక్టర్ ,వీరనారి చాకలి ఐలమ్మ( Chakali Ailamma) 129 వ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు  జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా, జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha), అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

 Chakali Ailamma's Aspirations Should Be Inspired By Everyone-district Collector-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.

Telugu Chakali Ailamma-Telugu Districts

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube