చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
TeluguStop.com
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ,నివాళులర్పించిన జిల్లా కలెక్టర్(District Collector), అదనపు కలెక్టర్ ,వీరనారి చాకలి ఐలమ్మ( Chakali Ailamma) 129 వ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేపట్టగా, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha), అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.
"""/" /
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చేపల కోసం శృంగారం.. ట్రంప్ దెబ్బతో మహిళలకు దారుణ పరిస్థితి.. షాకింగ్ నిజం బయటపడింది!