తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి సామాన్య నటులుగా వచ్చి చాలామంది స్టార్ హీరోలు గా ఎదిగారు వాళ్లలో ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు మోహన్ బాబు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున వంటి హీరోలు సినిమా ఇండస్ట్రీ లో తమదైన ఒక స్థాయి నటనను చూపించి జనాలు అందరినీ ఆకర్షించారు దీంట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు అన్ని జోనర్లో వచ్చే సినిమాలను తీసి తనదైన మార్క్ ని ఇండస్ట్రీపై చూపించారు.ఆయన తర్వాత అంతటి నటనని చూపించిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా చిరంజీవి అనే చెప్పాలి.
చిరంజీవి ఒక సాధారణ నటుడిగా వచ్చి అప్పటివరకు ఉన్న డాన్స్ గాని, ఫైట్స్ గాని బ్రేక్ చేస్తూ తనదైన శైలిలో బ్రేక్ డాన్స్ లతో ఫైట్లతో ప్రేక్షకుల్ని అలరించాడు జనాలు అందరి చేత మెగాస్టార్ అనిపించుకున్నాడు.అలా వీళ్లతో పాటు వీళ్ళ ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమయ్యారు.
చిరంజీవి కొడుకు అయినా రామ్ చరణ్ తనదైన నటనను చూపిస్తూ యంగ్ హీరోలందరిలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు.అలాగే కృష్ణ కొడుకైనా మహేష్ బాబు కూడా తనదైన స్థాయి నటనతో జనాలు అందరినీ నవ్విస్తూ సంపూర్ణ నటుడుగా పేరు సంపాదించి ముందుకు దూసుకెళ్తున్నాడు.

అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పౌరాణికమైన కమర్షియల్ సినిమాలు అయిన నటనలో తనని బీట్ చేసే వారు తెలుగు లో లేరని తన నటనతో అందరికీ చూపిస్తూ వస్తున్నాడు.కృష్ణంరాజు వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తెలుగు నుంచి మొదటి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.అయితే ఇప్పుడున్న స్టార్స్ అందరూ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.సినిమాల్లో పేజీలు పేజీలు డైలాగులు చెప్పే హీరోలకి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాదు.మహేష్ బాబు లాంటి హీరో చెన్నై లో చదువుకున్నాడు కాబట్టి మొదట్లో మహేష్ బాబుకి తెలుగు మాట్లాడడం రాయడం సరిగా వచ్చేది కాదు.తెలుగులో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సినిమాల్లోకి వచ్చాడు ఇప్పటికీ మహేష్ కి తెలుగులో రాయడం రాదు.

మహేష్ బాబు పరిస్థితి ఇలా ఉంటే రామ్ చరణ్, నాని, అల్లు అర్జున్ లాంటి హీరోలు సినిమాల్లో పేజీలకు పేజీలు డైలాగులు చెప్పినప్పటికీతెలుగులో ఇప్పటికీ వరకు సరిగ్గా మాట్లాడటం రాదు అంటే నమ్ముతారా.ఇప్పటికీ వాళ్లకి తెలుగులో ‘ల’ కి ‘ళ’ కి తేడా తెలియదు.పెళ్లి అని పలికేటప్పుడు పెల్లి అని అంటారు.అలా అనేటప్పుడు ‘లా’ అంటారు తెలుగు లో స్టార్ హీరోలు అయినప్పటికీ తెలుగులో సరిగా మాట్లాడటం, పలకడం ఇంకా మన హీరోల కి రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు.

మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మి తెలుగు మాట్లాడితే అయితే అసలు అది తెలుగేనా అని మనం నివ్వర పోవాల్సిందే.హీరో మంచు విష్ణు అయితే తెలుగులో లో చాలా పదాలని స్పష్టంగా పలక లేడు.కానీ తెలుగులో చాలా సినిమాలలో యాక్టింగ్ చేశాడు ఇంకో హీరో నితిన్ అయితే కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నాడో సరిగా అర్థం కూడా కాదు ఎందుకంటే అతనికి మాట్లాడుతుంటే నత్తి వస్తుంది.

ఇలా చాలా మంది హీరోలు తెలుగులో చాలా పెద్ద హీరోలు అయిపోయాం అనుకుంటున్నారు గానీ తెలుగు మాట్లాడడం మీద కొంచెం శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు అని వీళ్ళ మాటలు వింటే మనకు అర్థం అవుతుంది.దేశ భాషలందు తెలుగు భాష లెస్స అనే పదానికి న్యాయం చేయాలంటే మన హీరోలు ప్రస్ఫుటమైన స్పష్టమైన తెలుగులో మాట్లాడడం అలవర్చుకోవాలి.