ప్రతిభ చూపిన విద్యార్థికి కలెక్టర్ అభినందన

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతిభ చూపిన విద్యార్థి జక్కని హేమంత్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) శనివారం అభినందించారు.సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సిరిసిల్ల విద్యార్థి జక్కని హేమంత్, గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తయారుచేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఎగ్జిబిట్ ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయికి ఎంపికైంది.

 Collector Congratulates The Student Who Has Shown Talent, Jakkani Hemant, Sandee-TeluguStop.com

నేతన్నల కష్టాలకు పరిష్కారం చూపేది గా  తయారుచేసిన ఈ ఎగ్జిబిట్ గతంలో పలువురి మన్ననలు పొందింది.ఎగ్జిబిట్ జాతీయస్థాయికి  ఎంపికవడంతో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థి హేమంత్ తో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలువగా, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయస్థాయికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube