శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాకబంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రత భావం కల్పించడ కోసం నాకబంధీ లాంటి కార్యక్రమాలు తరచు నిర్వహించడం జరుగుతుందని,అందులో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం 06 గంటల నుండి 08 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు.జిల్లాలోకి వచ్చే అన్ని దారులులలో,మండల కేంద్రాల్లో పోలీస్ అధికారులు,సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల యెక్క వివరాలు, వాహనాలు వాటి యెక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి , డాక్యుమెంట్స్ లేని ,నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

 As Part Of Monitoring Of Law And Order, There Is A Ban Across The District. , La-TeluguStop.com

నాకబందిలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) ఐపీఎస్ అంబేద్కర్ చౌక్, రగుడు చౌరస్తా వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…అసాంఘిక శక్తులను ,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు,నేరా నివారణకే జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసులు లక్ష్యమని తెలిపారు.

జిల్లాలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు లేదా డయల్100కు సమాచారం అందించినచో చర్యలు చేపడతాం అన్నారు.తరచు ఇలాంటి తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గించి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.

నిబందనలకు విరుద్దంగా ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసిన, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన,హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన , మైనర్ డ్రైవింగ్ చేసిన,మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.దొంగ వాహనాలను గుర్తించడానికి , ప్రమాదాల నివారణకు,నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరికట్టడానికి ఈ యొక్క తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని ప్రజలు పోలీస్ వారికీ సహకరించలని కోరారు.

ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ సదన్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube