ఎల్లారెడ్డిపేటలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం సాయంత్రం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు ఆర్ ఐ మధుకర్,ఎస్సై కిరణ్ కుమార్ వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

 Police Special Drive In Ellareddypet-TeluguStop.com

ప్రతి ఒక్క వాహనాల పత్రాలు తనిఖీ చేసి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి పట్టుబడ్డారు.

ఫోర్ వీలర్ వాహనాల గ్లాస్ లకు బ్లాక్ పేపర్ తొలగించారు.

ప్రతి వాహనాలకు( vehicles ) సైరన్లు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఈ స్పెషల్ ప్రతిరోజు ఉంటుందని మైనర్ పిల్లలు అనగా 18 సంవత్సరాలు నిండిన వారికి వాహనాలు ఇవ్వకూడదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు సరైన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని అన్నారు.

అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనానికి ముందు వెనక నెంబర్ ప్లేట్ అమర్చుకొని వాహనాలు నడిపినట్లయితే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రమాదానికి గురైన వ్యక్తి యొక్క ఆధారాలు సులువుగా గుర్తించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో సుమారు 15 మంది పోలీసులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube