బాయ్‌ఫ్రెండ్ చీట్ చేశాడని లైవ్‌లోనే బోరున ఏడ్చేసిన టీవీ స్టార్..??

గ్లామర్ ప్రపంచంలో ఆడవాళ్లైనా లేదంటే మగవాళ్ళైనా చీటింగ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతుంది.అయితే వీళ్లు కూడా మనుషులే కాబట్టి మోసాయనకి గురైనప్పుడు చాలా బాధపడిపోతారు కొందరైతే సూసైడ్ కూడా చేసుకుంటారు.

 Tv Star Who Cried Bitterly On Live That Boyfriend Cheated, Kristen Kelly, Reali-TeluguStop.com

అయితే ఇటీవల బ్యాడ్ గర్ల్స్ క్లబ్ రియాలిటీ షో ఫేమ్ క్రిస్టెన్ కెల్లీ( Kristen Kelly ) తన బాయ్‌ఫ్రెండ్ చీట్ చేశాడని లైవ్‌లోనే బోరున ఏడ్చేసింది.గర్భవతిగా ఉన్న సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ క్రిస్ షివిన్క్ తన స్నేహితురాలు కాలిన్( Kalyn Hutchins ) తో మెక్సికోలో రొమాన్స్ చేశాడని తెలుసుకున్నట్లు ఆమె ఏడ్చేసింది.

టిక్‌టాక్‌లో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో ఆమె చెప్పిన ప్రకారం, 34 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తన ప్రియుడు మొత్తం వారం పనిలో ఉన్నానని చెప్పాడు.

నిండు గర్భిణిగా ఉన్నావు కాబట్టి కేవలం గంటలో వచ్చేంత దూరంగానే ఉంటానని ఆమెకు మాటిచ్చాడట.

అయితే ఒకరోజు కెల్లీ గోఫండ్‌మీ పేజీని చూసి ఆశ్చర్యపోయింది.ఈ పేజీని కాలిన్ కుటుంబం సృష్టించింది, మెక్సికోలో జరిగిన మోటారుసైకిల్ ప్రమాదంలో కాలిన్, షివిన్క్ గాయపడ్డారని వివరించింది.ఈ ప్రమాదం వల్ల వారి సీక్రెట్ హాలిడే ట్రిప్ బయటపడిందని కెల్లీ బాధతో వీడియోలో చెప్పింది.

కెల్లీ తన వీడియోలో మరో విషయాన్ని కూడా పంచుకుంది.వారి ఆటిస్టిక్ బాధిత కూతురిని చూసే బాధ్యత ప్రధానంగా తనదేనని చెప్పింది.ఆమె భావోద్వేగంతో చేసిన లైవ్ స్ట్రీమ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియా( Social media )లో చాలా వైరల్ అయ్యింది.కెల్లీ వీడియోకి వచ్చిన రియాక్షన్లు కూడా భిన్నంగా ఉన్నాయి.

చాలా మంది ఆమె పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశారు.ఆమె పిల్లలపై దృష్టి పెట్టుకోమని, ప్రియుడిని మరిచిపోమని సలహా ఇచ్చారు.

కానీ కొంతమంది మాత్రం, బహిరంగంగా భావోద్వేగాలను పంచుకోవడం కంటే ఆమె ప్రైవేటు సహాయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియా మానసిక చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, కెల్లీ తన పిల్లలు, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు సలహా ఇచ్చారు.

అయితే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అనేది బాయ్ ఫ్రెండ్ కర్మ ఫలితంగా జరిగిందని ఇంకొందరు చెప్పారు.ఇలా మోసం చేసేవారితో కలిసి ఉండటం కంటే ఒంటరిగా బ్రతకడమే మేలు అని ఇంకొందరు చెప్పారు.

అయితే ఒక టీవీ స్టార్ కావడంతో ఆమె వీడియో సంచలనం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube