బ్రిటన్‌లో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌కు సంబంధించి కొత్త నియమాలు రాబోతున్నాయి.రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ ( BMA ) మద్యం సేవించే విషయంలో కొన్ని మార్పులను సిఫార్సు చేసింది.
ఈ మార్పులకు చాలా మంది మద్దతు ఇస్తున్నారు.ప్రస్తుతం, బ్రిటన్‌లో డ్రైవింగ్‌లో మద్యం సేవించడానికి గరిష్ట పరిమితి 80mg/100ml రక్తం.
BMA ఈ పరిమితిని కమర్షియల్ డ్రైవర్లు, కొత్తగా లైసెన్స్ పొందిన వ్యక్తులకు 20mg/100mlకి తగ్గించాలని సిఫార్సు చేస్తోంది.అంటే అంతకుమించి ఆల్కహాల్ తాగితే చట్టపరమైన చర్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది.
ఈ కొత్త నియమాల వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతున్నారు.లిమిట్ దాటి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన వారికి కఠినమైన శిక్షలు పడతాయి కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది.
రహదారులపై భద్రత పెరుగుతుంది.యూకే( UK )లో ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది డ్రైవర్లు, మద్యాన్ని సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధమని తెలిసినా, పట్టుబడతామేమో అని భయపడకుండా వాహనాలు నడుపుతున్నారని రోడ్డు ప్రమాదాల నిపుణుడు జాన్ కుష్నిక్ చెప్పారు.
ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికి వైద్యుల సంఘం BMA కొత్త నిబంధనలు సూచించింది.ప్రస్తుతం, రక్తంలో 80mg/100ml మద్యం ఉంటేనే డ్రైవింగ్ చేయడం నేరం.కానీ, BMA దీన్ని 50mg/100mlకి తగ్గించాలని చెబుతోంది.
అంతేకాకుండా, కొత్తగా లైసెన్స్ తీసుకున్న వారు, వాణిజ్య డ్రైవర్లకు ఈ పరిమితిని మరింత తగ్గించి 20mg/100mlకి చేయాలని సూచించారు.
ఈ మార్పులకు 17కి పైగా సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.డ్రైవింగ్‌లో మద్యం సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యం పాడవడమే కాకుండా, ఆసుపత్రులు, పోలీసులు ఇలా అందరిపైనా భారం పడుతుందని BMA వాదించింది.కొత్త నిబంధనలు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని వారు నమ్ముతున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్( Drunk and drive ) కేసులు చాలా ఎక్కువగా నమోదయినందున జులై నెల అత్యంత ప్రమాదకరమైన నెల అని ఒక ఇన్సూరెన్స్ వెబ్‌సైట్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.2022 జులైలోనే, పోలీసులు 4,217 మందిని అరెస్ట్ చేశారు, వీరిలో ఎక్కువ మంది లండన్, నార్తర్న్ ఐర్లాండ్, సోమర్‌సెట్ ప్రాంతాలకు చెందినవారు.