అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. ఈ సూప‌ర్ ఫుడ్స్ తో చెక్ పెట్టండి!

అధిక రక్తపోటు( High blood pressure ).మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

 These Super Foods Help To Get Rid Of High Blood Pressure! Superfoods, High Blood-TeluguStop.com

అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అని కూడా పిలుస్తారు.కంటి నిండా నిద్ర లేకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవ‌డం, ధూమపానం, మద్యపానం, అధిక శరీర బరువు తదితర అంశాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయి.

తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారడం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటివి అధిక రక్తపోటు యొక్క లక్షణాలు.

Telugu Pressure, Cardamom, Cinnamon, Flax Seeds, Garlic, Tips, Bp, Latest, Super

వీటిని నిర్లక్ష్యం చేయకుండా జీవన శైలిలో పలు మార్పులు మరియు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సులభంగా అధిక రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు.మొదట ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోవాలి.కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఒత్తిడికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.ప్రతినిత్యం అరగంట పాటు వ్యాయామం చేయాలి.

బయటీ ఆహార పదార్ధాల జోలికి వెళ్ల‌కుండా ఉండాలి.కారం, ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి.

డైట్ లో మాంసాహారాలు కాకుండా కూరగాయలు ఆకుకూరలు తాజా పండ్లు ఉండేలా చూసుకోండి.

Telugu Pressure, Cardamom, Cinnamon, Flax Seeds, Garlic, Tips, Bp, Latest, Super

ఇకపోతే దాల్చిన చెక్క హైబీపీని కంట్రోల్ చేయడంలో ఒక సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది.ప్రతినిత్యం ఒక గ్లాస్ వాటర్ లో పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ( Cinnamon powder ) కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అలాగే యాలకులు కూడా అధిక రక్తపోటుకు చెక్ పెట్టగలవు.

అందుకోసం రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలి తినేయండి.అధిక‌ రక్తపోటును కంట్రోల్ చేసే సామర్థ్యం అవిసె గింజలకు( Flax seeds ) ఉంది.

రోజుకు వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే హై బీపీకి బై బై చెప్పవచ్చు.ఇక‌ రోజుకి ఒకటి లేదా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే రక్తపోటు అదుపులోకి రావడమే కాకుండా కొలెస్ట్రాల్ సైతం కరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube