ఉసూరుమనిపించిన గుజరాత్ ఎన్ఆర్ఐల డిపాజిట్లు .. కారణమిదేనా..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన ప్రవాస భారతీయులు.( NRI’s ) స్వదేశానికి ఎన్నో రకాలుగా లాభాలను చేకూరుస్తున్నారు.

 Nri Deposits In Gujarat Show Marginal Increase Amid Economic Challenges Abroad D-TeluguStop.com

వీరి వల్ల పెద్ద సంఖ్యలో విదేశీ మారక ద్రవ్యం భారతదేశ ఖజానాకు జమ అవుతోంది.దీనికి తోడు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా వారు ప్రభుత్వాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.

స్వదేశంలో పెట్టుబడులు పెట్టి.ఎంతో మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

ఇక కోవిడ్ సమయంలో ఎన్ఆర్ఐలు చేసిన సాయాన్ని ఈ దేశం మరిచిపోదు.

ఎప్పటిలాగే ప్రవాస భారతీయుల నుంచి మనదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం వచ్చింది .అయితే అమెరికా, బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాలలో ఆర్ధిక సవాళ్ల కారణంగా 2023-24 ఆర్ధిక సంవత్సరంలో గుజరాత్‌కు( Gujarat ) చెందిన ఎన్ఆర్ఐలు తక్కువ మొత్తంలోనే డబ్బును పంపినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్‌బీసీ)( State Level Bankers Committee ) నివేదిక ప్రకారం.గుజరాత్‌లో ఎన్ఆర్ఐ డిపాజిట్లు 2022-23లో రూ.91,923.69 కోట్ల నుంచి రూ.92,339.75 కోట్లు పెరిగాయి.అంటే రూ.416 కోట్లు పెరుగుదల.

Telugu Ahmedabad, America, Britain, Gandhinagar, Gujarat, Gujarat Nris, Gujaratn

గుజరాత్‌లోని 33 జిల్లాల్లో అహ్మదాబాద్, గాంధీనగర్, వల్సాద్, బరూచ్, దాహోద్, తాపీ, ఛోటా ఉదేపూర్‌లలోని ఏడు జిల్లాల్లో డిపాజిట్లు తగ్గాయి.గాంధీనగర్‌లో( Gandhi Nagar ) అత్యధికంగా రూ.1550 కోట్లు క్షీణించగా.అహ్మదాబాద్ , బరూచ్‌లలో విడివిడిగా రూ.100 కోట్లకు పైగా తగ్గాయి.దీనికి విరుద్ధంగా వడోదరాలో అత్యధికంగా రూ.713 కోట్ల పెరుగుదలతో ఎన్ఆర్ఐ డిపాజిట్లు( NRI Deposits ) పెరిగాయి.అదే సమయంలో ఆనంద్‌లో రూ.373 కోట్లు.సూరత్‌లో రూ.274 కోట్లు.రాజ్‌కోట్‌లో రూ.252 కోట్లు ఉన్నాయి.2023-24లో అత్యధికంగా ఎన్ఆర్ఐ డిపాజిట్లు ఉన్న మొదటి ఐదు జిల్లాలుగా అహ్మదాబాద్ రూ.20,464 కోట్లు .కచ్ రూ.14,863 కోట్లు.వడోదర రూ.14,629 కోట్లు.ఆనంద్ రూ.8,181 కోట్లు.రాజ్‌కోట్ రూ.7,305 కోట్లుగా ఉంది.

Telugu Ahmedabad, America, Britain, Gandhinagar, Gujarat, Gujarat Nris, Gujaratn

పాశ్చాత్య దేశాల్లో ఆర్ధిక అనిశ్చితి, ఉద్రిక్తతల కారణంగా ఎన్ఆర్ఐ డిపాజిట్లలో మార్పులు వస్తున్నాయని బ్యాంకర్లు చెబుతున్నాయి.ఈ సమస్యలు ఎన్ఆర్ఐలు ఇంటికి పంపే డబ్బుపై ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొన్నారు.సవాళ్లు ఎదురైనప్పటికీ ఎన్ఆర్ఐలు తమ రెమిటెన్స్‌లను 2 నుంచి 5 శాతం పెంచారు.విదేశాల్లో వడ్డీ రేట్లు 5 నుంచి 6 శాతం ఎక్కువగా ఉన్నందున ఎన్ఆర్ఐలు తమ డబ్బు విషయం జాగ్రత్తగా ఉంటారు.

బ్రిటన్ , దుబాయ్, ఆఫ్రికన్ దేశాలు కూడా మంచి రాబడిని అందిస్తాయి.ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని బ్యాంకులలో ఎన్ఆర్ఐలు ఎంత డబ్బును ఉంచారనేది ప్రభావం చూపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube