అది ఆకలి అనుకున్నంత చిన్న సమస్య ఏమీ కాదు.దీని కారణంగా ఏది పడితే అది పొట్టలోకి తీసేస్తూ ఉంటారు.
దాంతో బరువు పెరుగుతుంటారు.శరీర బరువు అదుపు తప్పితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయి, అందుకే అతి ఆకలికి చెక్ పెట్టడం ఎంతో అవసరం.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి అద్భుతంగా సహాయపడుతుంది.
రోజు ఉదయం ఈ పొడిని తీసుకుంటే అతి ఆకలి దూరం అవ్వడమే కాదు వేగంగా బరువు కూడా తగ్గుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు ఫూల్ మఖానా వేసి క్రిస్పీ గా వేయించుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో అరకప్పు బాదం, ఐదు గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలు వేసి వేయించుకోవాలి.
చివరిగా రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు( Sesame ), రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు, అంగుళం ఎండిన అల్లం ముక్క వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పదార్థాలన్నిటితో పాటు ఒక కప్పు పటిక బెల్లం పొడి( Jaggery Powder ), నాలుగు యాలకులు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక గ్లాసు పాలలో( Milk ) వేసి మరిగించి సేవించాలి.ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ లో ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే అతి ఆకలి అన్న మాటే అనరు.ఈ పొడిలో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది.అందువల్ల ఈ పొడిని తీసుకుంటే త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.అదే సమయంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.పైగా ఈ పొడిని తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ సమస్య సైతం అదుపులోకి వస్తుంది.