Vadivelu: తెలుగులో నేరుగా వడివేలు నటించిన ఆ ఒక్క సినిమా ఏంటి ?

వడివేలు.( Vadivelu ) అయన నటించిన సినిమాలు మాత్రమే కాదు అయన పేరు చెప్పిన కూడా ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వు రావడం ఖాయం.

 Vadivelu Straght Movie In Telugu Aaro Pranam-TeluguStop.com

తెలుగు లో బ్రహ్మానందం( Brahmanandam ) ఎలాగో తమిళులకు వడివేలు అలాగే.ప్రస్తుతం కెరీర్ పరంగా కొంచం డౌన్ ఫాల్ అయితే చూస్తున్న వడివేలు ఒకప్పుడు ప్రేమదేశం, చంద్రముఖి, ఒకే ఒక్కడు, ప్రేమికుడు వంటి అనువాద సినిమాలతో తెలుగు వారిని ఎంతగానో నవ్వించాడు.1988 లో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తమిళనాట తిరుగు లేని కమెడియన్ గా( Comedian ) ఎదిగారు.ఒక నటుడు 35 ఏళ్లపాటు జనాలను కడుపుబ్బా నవ్వించడం అంటే అంత ఈజీ కాదు.

ఇప్పుడు సినిమా ఉన్న పరిస్థితులలో కేవలం ఒక పది సినిమాలకే రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు.ఎక్కువ సినిమాల్లో నటిస్తుంటే మొనాటని అంటూ పెదవి విరుస్తున్నారు.

Telugu Aaro Pranam, Vadivelu, Brahmanandam, Ali, Vineeth, Soundarya, Tollywood,

కానీ వడివేలు కు మాత్రం అది చాల సునాయాసంగా సాధ్యం అయ్యింది.కామెడీ కి ఒకరకంగా చెప్పాలంటే ఆయనొక బ్రహ్మ.టైమింగ్ విషయంలో, పంచులు ధారాళంగా వేయడంలో వడివేలు తర్వాతే ఎవరైనా.ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళ సినిమాలు( Tamil Movies ) మినహా బయట భాషల్లో చాల తక్కువ సినిమాల్లో నటించారు.

అయన తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరి వారు అయినప్పటికీ కేవలం ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమాలో నటించారు.

Telugu Aaro Pranam, Vadivelu, Brahmanandam, Ali, Vineeth, Soundarya, Tollywood,

వడివేలు నేరుగా నటించిన ఆ తెలుగు సినిమా మరేదో కాదు.వినీత్,( Vineeth ) సౌందర్య( Soundarya ) హీరో హీరోయిన్స్ గా నటించిన ఆరో ప్రాణం చిత్రంలో.( Aaro Pranam Movie ) ఈ సినిమా 1997 లో విడుదల అయ్యి మంచి సినిమా అనిపించుకుంది.

ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో వినీత్ కి స్నేహితుడి పాత్రలో వడివేలు కనిపించరు.ఈ సినిమాకు వీరు.కె అని దర్శకుడు డైరెక్టర్ కాగా తాను నటించిన ఈ తెలుగు సినిమాకు డబ్బింగ్ మాత్రం అతడు చెప్పుకోలేదు.ఆ బాధ్యతను ప్రముఖ తెలుగు కామెడియన్ ఆలీ నిర్వర్తించాట.

ఇలా ఆలీ డబ్బింగ్ చెప్పగా వడివేలు ఆరోప్రాణం సినిమాలో తన పాత్రకు ప్రాణం పోశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube