2021 వ సంవత్సరం డిసెంబర్ మూడవ వారం లో వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.తెలుగులో టికెట్ రేట్స్ లేకపోవడం వల్ల ఫ్లాప్ గా నిల్చింది కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
హిందీ, తమిళం మరియు కన్నడం ఇలా భాషతో సంబంధం లేకుండా అన్నీ రాష్ట్రాలు పుష్ప మేనియా లో మునిగిపోయింది.గడిచిన రెండు దశాబ్దాలలో బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో దేశం మొత్తం ఊగిపొయ్యెలా చేసిన ఏకైక చిత్రం పుష్ప.
ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

‘పుష్ప : ది రూల్‘( Pushpa 2 ) పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి గ్లిమ్స్ వీడియో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఫస్ట్ లుక్ అదిరిపోయింది దీంతో ఈ చిత్రం పై అంచనాలు టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా అమాంతం పెరిగిపోయాయి.రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తారీఖున విడుదల చేయబోతున్నాం అని అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.ఇదే తేదీన అజయ్ దేవగన్ , రోహిత్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న ‘సింగం 3′ విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించి చాలా రోజులే అయ్యింది.కానీ ‘పుష్ప: ది రూల్’ కూడా అదే రోజు వస్తుంది అని తెలియడం తో ‘సింగం 3 ‘ వాయిదా( Singham 3 ) పడింది.సింగం సిరీస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.
అందులోనే అజయ్ దేవగన్ , రోహిత్ శెట్టి కాంబినేషన్ అంటే నార్త్ ఇండియన్స్ మెంటలెక్కిపోతారు.

అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కూడా పుష్ప కి భయపడింది అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఇండియా మొత్తం ‘తగ్గేదేలే’ మ్యానరిజం తో ఊగిపోయిన సినిమా సీక్వెల్ తో పోటీ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది అని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.అంతే కాకుండా మంచి విడుదల తేదీ ఇచ్చారని , లెక్కేసి కొడితే మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ రావాలని, ఆ తర్వాత ఫుల్ రన్ లో కనీసం 1600 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.
మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.