1.పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
2.కవితను విచారిస్తున్న ఈడి అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడి అధికారులు ఈ రోజు విచారిస్తున్నారు.
3.ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది .టిడిపి , వైసిపి ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
4.టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను మూడో రోజు సిట్ అధికారులు ఈరోజు విచారిస్తున్నారు.
5.స్కిల్ స్కాంపై దర్యాప్తు చేస్తాం : బుగ్గన
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తామని ఏపీ మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి తెలిపారు.
6.వై నాట్ పులివెందుల

వై నాట్ పులివెందుల ఇకపై ఇదే మా నినాదం అని టిడిపి ఎమ్మెల్సీ , పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి అన్నారు.
7.ఓటమిపై సమీక్షించుకుంటాం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
8.అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి : పీడీఎఫ్

జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ లు డిమాండ్ చేశారు.
9.ఆప్కాబ్ డిసిసిబి లకు ఒకే సర్వీస్ రూల్స్
ఏపీలో డిసిసిబిలు, ఆప్కాబ్ లకు ఒకే సర్వీస్ నిబంధనలు వర్తించేలా ఒక పాలసీని రూపొందించిట్లు సహకార మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
10.టీచర్లపై ఒత్తిడి చేయడం తగదు

ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం తగదని , టీచర్లను కేవలం బోధనకే పరిమితం చేయాలని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
11.తెలంగాణకు 31 క్రిటికల్ కేర్ బ్లాక్స్
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకాల కింద దేశవ్యాప్తంగా 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ ను దశల వారీగా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది .దీనిలో భాగంగా తెలంగాణకు 31 క్రిటికల్ కేర్ బ్లాక్స్ ను కేటాయించారు.
12.టర్మ్ డిపాజిట్ లపై బీ ఓ బీ వడ్డీ పెంపు

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్.ఆర్.ఓ, ఎన్ ఆర్ ఈ టర్మ్ డిపాజిట్లు సహా దేశ టర్మ్ డిపాజిట్ లపై వడ్డీ రేటును 0.25% మేరకు పెంచింది.
13.కెసిఆర్ పై షర్మిల విమర్శలు
తెలంగాణ యువతను ఉద్యోగాల పేరుతో సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
14.టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ, ఆ సంస్థ చైర్మన్ రాజీనామా చేయాలని బీ.ఎస్.పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
15.ఎస్ సి టి ఎస్ ఐ రాత పరీక్ష
స్టైఫండరీ క్యారెట్ ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ టెక్నికల్ రాత పరీక్షలు ఈనెల 26 నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
16.జగన్ ను కలిసిన టీచర్ ఎమ్మెల్సీలు

వైసీపీ మద్దతుతో నూతనంగా ఎన్నికైన టీచర్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి , మధుసూదన్ ఏపీ సీఎం జగన్ ను ఈరోజు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
17.పోడియం దగ్గరకు వస్తే ఆటోమేటిక్ గా సస్పెన్షన్
స్పీకర్ పోడియం నిరసన వ్యక్తం చేస్తే ఆటోమేటిక్ గా సంబంధిత సభ్యులకు సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ సభలో రూలింగ్ ఇచ్చారు.
18.చంద్రబాబు విమర్శలు

టీడీపీ ఎమ్మెల్యే స్వామిపై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు.చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని చంద్రబాబు పేర్కొన్నారు.
19.చైల్డ్ పోర్న్ పై తెలంగాణా పోలీసుల హెచ్చరిక
చైల్డ్ పోర్న్ చూస్తే జైలుపాలు అవుతారని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,800
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 59,780
.