కుడిక్యాల నాగరాజు చేసుకున్నది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యే

ఉపాధి లేక ఇంకా ఎంతమంది పవర్లూమ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలి కుడిక్యాల నాగరాజు చేసుకున్నది ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్యే పవర్లూమ్ కార్మికుల గోస ప్రభుత్వానికి పట్టదా ఆత్మహత్య చేసుకున్న నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్సిగ్రేషియా అందించాలి ప్రభుత్వం వెంటనే వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించి కార్మికులకు ఉపాధి కల్పించాలి , ఆత్మహత్యలను నివారించాలి సీఐటీయూ – తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు – ముశం రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బి.వై.

 Kudicyala Nagaraju Did Not Commit Suicide But Was Murdered By The Government , M-TeluguStop.com

నగర్ లోని కామ్రేడ్.అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సంక్షోభం వలన ఉపాధి లేకపోవడంతో ఒకవైపు చేసిన ఆప్పులు కట్టలేక , మరోవైపు కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్రమైన మనోవేదనకు , మనస్థాపానికి గురి అయ్యి ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ కు చెందిన కుడిక్యాల నాగరాజు అనే నేత కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందని నాగరాజు చనిపోవడానికి కారణం ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోవడమేనని, కుటుంబ పెద్దను కోల్పోయిన నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పవర్లూమ్ వర్కర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి నాగరాజుకు గత ఆరు మాసాల నుంచి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు పుస్తకాలు కూడా కొనకెందుకు డబ్బులు లేక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని కార్మికులకు ఉపాధి కల్పించవలసినటువంటి ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసి ఉన్న ఉపాధి తీసేసి కార్మికులకు పని లేకుండా చేసి కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ప్రభుత్వం తీసుకు వచ్చిందనన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పై కక్ష సాధింపు చర్యలలో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాల వలన వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టవేయబడి గత ఆరు మాసాలలో 8 మంది కార్మికులు ఆత్మహత్యలకు గురి కావడం జరిగిందని అయినా కూడా ప్రభుత్వం లో చలనం రావడంలేదని పవర్లూమ్ కార్మికులు చేసుకుంటున్నవి ఆత్మహత్యలు కావని ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు.ఇంతటి దారుణమైన పరిస్థితి సిరిసిల్లలో కొనసాగుతుంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరని కేటీఆర్ కి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

అధికారపక్షం , ప్రతిపక్షాల రాజకీయాల మధ్య ఇంకెంతమంది పవర్లూమ్ కార్మికులను బలితీసుకుంటారని మండి పడ్డారు.ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ కక్షసాధింపు ధోరణి విడనాడి ఆత్మహత్యల నివారణ చర్యలు తీసుకోవాలని కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 10 కోట్ల మీటర్ల ప్రభుత్వ వస్త్రాన్ని సిరిసిల్లలో ఉత్పత్తి చేయించాలని , కార్మికులకు రావాల్సిన 10 % యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలని , పవర్లూమ్ పరిశ్రమకు గుండెకాయ వంటి విద్యుత్ సమస్య పరిష్కరించి ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.

ఈ సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నక్క దేవదాస్ , బెజుగం సురేష్ , సందుపట్ల పొచమల్లు , వేముల మనోహర్ , మామిడాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube