రైతులకు అందుబాటులో నాణ్యమైన పెట్రోల్, డీజిల్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలోని బొప్పాపూర్ (సర్వేపల్లి) గ్రామంలో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీపీసీఎల్ నూతన (పునరుద్ధరణ) పెట్రోల్ బంకు ను గురువారం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎసిఎస్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డీజిల్ ,పెట్రోల్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు, వినియోగదారులు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు.

 Quality Petrol And Diesel Available To Farmers, Quality Petrol ,diesel , Farmers-TeluguStop.com

రాబోయే రోజులలో సహకార సంఘాలను అభివృద్ధి పరచడంలో భాగంగా మల్టీ సర్వీసెస్ ను (రైస్ మిల్లులు సిఎస్సి సెంటర్లు, వాటర్ ప్లాంట్ లో, వివిధ రకాల సేవలు అందుబాటులోకి తీసుకు వస్తావని వాటి ద్వారా సొసైటీలను అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సంఘ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు ల్యాగల సతీష్, నెవూరి వెంకట నరసింహ రెడ్డి, దొమ్మాటి నర్సయ్య,గండ్ర ప్రభాకర్ రావు, గోగూరి ప్రభాకర్ రెడ్డి,జిల్లా సహకార ఆఫీస్ నుండి అసిస్టెంట్ రిజిస్టర్ చాంద్ పాషాగారు, బిపిసిఎల్ సేల్ ఆఫీసర్ శిరంజిత్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మట నర్సయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొడుసు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్, వివిధ గ్రామాల ఎంపిటిసిలు మాజీ సర్పంచులు ,వార్డు మెంబర్లు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు రైతులు, సంఘ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube