రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆది మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆలోచనా విధానం ముందుకు తీసుకెళ్దామని అన్నారు.అనాడు బ్రిటిష్ పాలనలో వివక్షకు, వారి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని, అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఏకం చేసి స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు.
ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, గతంలో పెండింగ్లో ఉన్న 3000 పై చిలుకు దరఖాస్తులకు శాశ్వత పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు.ప్రజలు విడివిగా ఉత్తరాలు రాస్తే మళ్లీ ఎందుకు రాయడం అని దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, ప్రజలు గ్రామపంచాయతీలో కూర్చొని నాకు వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా ఉత్తరాలు రాస్తే దానిని కూడా కొందరు తప్పుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
చీర్లవంచ గ్రామంలో మంచినీటి ఇబ్బంది ఉంటే బోర్లు వేపియడం, తెట్టకుంట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని, దశాబ్ద కాలంగా వెనుకబడిన వేములవాడను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వారి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు ఉన్నారు
.