రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలల అభివృద్ధి కోసం ఐదు కోట్ల 35 లక్షలు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రూరల్ యూత్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్, రూరల్ ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెదురి రమేష్, ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డి,మంత్రులు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం, చేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేస్తున్నారని అన్నారు, గత ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిందని, పట్టణంతోపాటు గ్రామాల అభివృద్దె లక్ష్యంగా ప్రభుత్వ పని చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ రోండి రాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, amc డైరెక్టర్ పాలకుర్తి పరశురాం, యూత్ కాంగ్రెస్ నాయకులు ,గ్రామా శాఖ అధ్యక్షులు , నాయకులు పాల్గొన్నారు.