రాజన్న సిరిసిల్ల జిల్లా: 17వ బెటాలియన్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి .వేణుగోపాల్ శుక్రవారం 17వ బెటాలియన్ లో పదవి విరమణ పొందారు.1982వ బ్యాచ్ కి చెందిన ఇతను 42 సంవత్సరాలు పోలీస్ వృత్తిలో విధులు నిర్వహించారు.వేణుగోపాల్ ఆయన సతీమణి శాంతకుమారి కి 17వ బెటాలియన్ కమండెంట్ ఎస్.శ్రీనివాసరావు సన్మానం చేసి వారికి పదవి విరమణ శుభాకాంక్షలను తెలిపారు.
ఈ సంద్భంగా కమాండెంట్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది ఒక వ్యక్తి జీవితంలో ఒక ప్రధాన అంశం, ఇది వారి కెరీర్ ముగింపును సూచిస్తుంది.ఇన్ని సంవత్సరాలు ఎంతో నిజాయితితో, నిబద్ధతతో, ఆరోగ్యముతో విధులు నిర్వహించారు.
ఇకపై కూడా ఈయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమండెంట్ రాందాస్ ,ఆర్ ఐ , ఆర్ ఎస్ ఐ లు, బెటాలియన్ సిబంది పాల్గొని వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.