బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల శాఖ అధ్యక్షులు నాగ సముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

 Presenting Petition To Br Ambedkar Statue , Rajanna Sirisilla District , Naga-TeluguStop.com

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్( Nagasamudra Santosh ) మాట్లాడుతూ రాజ్యాంగ అనుసార బద్దంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి దేశంలో ఉన్నతమైన స్థాయి దేశ ఉప రాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీష్ ధన్కర్ ను అవహేళన చేస్తూ వ్యంగంగా శరీర సౌష్టవాన్ని అనుకరిస్తూ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని వెంటనే వారి తీరును మార్చుకొని రాహుల్ గాంధీ( Rahul Gandhi ), అవహేళన చేసిన ఇతర ఎంపీలు కూడ దేశ ఉపరాష్ట్రపతి ,రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ కు క్షమాపణలు చెప్పి రాజ్యాంగ విధి విధానాలను గౌరవించి వెంటనే రాజీనామా చేయాలని, గతంలో కూడా పార్లమెంటులో రాహుల్ గాంధీ తీరుకు సస్పెండ్ అయినా కూడా వారి యొక్క వ్యవహార శైలి మారకపోవడం సరి అయినది కాదని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.ఇట్టి కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొలనూరు ముత్తక్క, దళిత మోర్చా మండల అధ్యక్షులు మామిడి శేఖర్, శక్తి కేంద్రం ఇన్చార్జులు పొన్నం కృష్ణ, సుధగోని శ్రీకాంత్, అధ్యక్షులు మంత్రి అరుణ్, కోమటిరెడ్డి అనిల్ రెడ్డి,వెంకటేష్ లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube