మర్రిపెల్లి రిజర్వాయర్ ను ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారు

మర్రిపెల్లి రిజర్వాయర్ ( Marripelli Reservoir )ను ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ డిమాండ్గత పది సంవత్సరాలుగా పనుల పేరిట చెరువుకు గండి తీశారు.చుక్క నీరు లేక పోవడం వల్ల చుట్టూ పది గ్రామాలలో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బంది రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి.

 When Will The Marripelli Reservoir Be Completed , Marripelli Reservoir, Rajaka,-TeluguStop.com

పెద్దమ్మ , మడేలయ్యా దేవాలయాలకు సంబంధించిన నిధులు రజక ,ముదిరాజ్ సంఘాలకు ఇవ్వాలి.కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అధికారుల అలసత్యం నిర్లక్ష్యం ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇన్ని సంవత్సరలు ఆలస్యం కావడం.?నెల రోజుల్లో పనులు ప్రారంభించక పోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తీసుకుంటాంరాజన్న సిరిసిల్ల జిల్లా :అధికార పార్టీ నిన్నటి రోజు 55 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని ప్రకటన చేయడం పచ్చి అబద్ధం.వ్యవసాయ శాఖ అధికారుల లెక్క ప్రకారం వేములవాడ రూరల్ మండలల్లో సుమారు 10 వేల ఎకరాలు, చందుర్తి మండలలో సుమారు 14 వేల ఎకరాలు రైతులు వ్యవసాయం చేస్తున్నట్టుగా లెక్కొలో ఉన్నది.

కోనారావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్, కథలాపూర్ భీమారం, మేడిపల్లి మండలలోకి గోదావరి జిల్లాలు (చుక్క) నీరు పోలేదన్నారు.అధికారుల లెక్కల ప్రకారం చూస్తే సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు వసున్నట్టు పదే పదే 55 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తున్నాం అన్న ప్రకటన పచ్చి బూటకం.రైతులు ప్రజలు గమనించవలసిందిగా కోరారు.30 మాసాల క్రితం లింగంపేటలో పైపులైను తెగిపోవడం వల్ల ఇంతవరకు మరమ్మత్తులు చేపట్టడం లేదని కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తి కాలేదు క్రింద 43 వేల ఎకరాలకు నీళ్లే ఇవ్వలేరన్నారు.ఇది 55 వేల ఎకరాలు సాగునీరు అందిస్తున్నాం అనడం పచ్చి అబద్ధమని రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులభరణం శ్రీనివాస్,ఎదురుగట్ల సర్పంచ్ కరుణాకర్, సంఘ స్వామి యాదవ్, బత్తిని ఎల్ల గౌడ్, మానుపాటి పరుశరాములు, జాగిరి సురేష్, రొండి రాజు, శ్రీనివాస్, సాయి ,మల్లేశం, చల్ల సురేష్, బండ శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, హరి నందన్ రెడ్డి, పట్టిక శ్రీనివాస్ రెడ్డి, దాన వేణు, చిలక ప్రభాకర్, స్థానిక రైతులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube