కోదాడ వంద పడకల ఆసుపత్రిలో నలుగురే డాక్టర్లు...!

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చొరవతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు.ఇది కోదాడ నియోజకవర్గంలో ప్రధాన ఏరియా హాస్పిటల్ కావడంతో నిత్యం వివిధ రకాల రోగులతో రద్దీగా ఉంటుంది.

 There Are Only Four Doctors In Kodada Hundred Bed Hospital , Kodada Mla Padmavat-TeluguStop.com

హాస్పిటల్ స్థాయి పెరిగినా కానీ, అప్పుడూ ఇప్పుడూ నలుగురే డాక్టర్లు ఉండడంతో రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా సీజనల్ వైరల్ ఫీవర్ వ్యాప్తి చెంది పట్టణాలు,గ్రామాలు విషజ్వరాలతో అల్లాడుతున్నాయి.

దీనితో కోదాడ ఏరియా ఆసుపత్రిలో జ్వర పీడితులు కిక్కరిసి,బ్లడ్ చెకప్,మెడికల్ ఓపిల వద్ద రోగులు బారులు తీరుతున్నారు.రోగులు ఎక్కువ డాక్టర్లు తక్కువ ఉండడంతో వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇదే విషయమై హాస్పిటల్ డాక్టర్ దశరథ్ నాయక్ ను వివరణ కోరగా…డాక్టర్ల కొరత ఉన్నా ప్రత్యేక చొరవ తీసుకొని చికిత్స అందిస్తున్నామని,గత నెలలో 6 డెంగ్యూ కేసులు నమోదైతే ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందించి సురక్షితంగా ఇంటికి చేర్చామని,22 రోజుల్లో 3528 మంది ఓపిలు నమోదు కాగా మలేరియా కేసులు రాలేదన్నారు.సాయంత్రం ఐదు నుండి 7 గంటల వరకు డెంగ్యూ దోమ తిరిగే సమయంలో దోమల మందు పిచికారి చేస్తే ఎలాంటి విష జ్వరాలు వ్యాప్తి చెందవని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇంటి చుట్టూ అపరిశుభ్రత ఉంటే వైరల్ ఫీవర్ రావడం ఖాయమన్నారు.శ్రీరంగాపురం,లక్ష్మీపురం కాలనీ, బాలాజీ నగర్ తండా, బొజ్జగూడెం తండా, తమ్మరబండ పాలెం, అల్వాలపురం,గోల్ తండా, బంజారా కాలనీ,సాలర్జింగ్ పేట,ఆకుపాముల,శాంతినగర్ గ్రామాలలో విష జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube