గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు

వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి నికోలస్రాజన్న సిరిసిల్ల జిల్లా: టి.ఎస్.

 Prepare For Group 1 Exam , Telangana Public Service Commission Secretary Nichola-TeluguStop.com

పి.ఎస్.సి.గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలలో సదుపాయాల కల్పన వివరాలు సమర్పించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి నికోలస్ అన్నారు.అన్ని జిల్లాల నోడల్ అధికారులు, పోలీస్ నోడల్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 9 న జరుగనున్న గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సీటింగ్, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, సి సి కెమెరాలు తదితర ఏర్పాట్ల పై చెక్ లిస్ట్ ప్రకారం పరిశీలించి నివేదికలు పంపించాలని తెలిపారు.

పరీక్ష సమయంలో అభ్యర్థులను విస్తృత తనిఖీ చేయడం, ఎలాంటి వస్తువులు అనుమతించడం జరగదని వివరంగా తెలియజేశారు.కమిషన్ ఆదేశాల మేరకు పరీక్షను సజావుగా నిర్వహించాలని తెలిపారు.బందో బస్తు కేంద్రాల వద్ద ఏర్పాటుచేయాలని తెలిపారు.వీడియో సమావేశం అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడుతూ, జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్సీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube